కమల్‌తో మీటింగ్‌…ఎంతో ప్రత్యేకం!

73
kamal
- Advertisement -

అందం,అభినయం,సహజ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయిపల్లవి…సూపర్ ఛాన్స్ కొట్టేసింది. తన పుట్టినరోజు సందర్భంగా వరుస సినిమాల అప్‌డేట్స్ ఇచ్చేసింది. ఇప్పటికే రానాతో విరాటపర్వంలో నటించగా అది విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు గార్గి అనే మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది.

అలాగే తమిళ స్టార్ శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది . ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహిస్తుండగా కమల్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది సాయిపల్లవి.

కమల్‌ హాసన్‌ సర్ దగ్గరి నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన పాఠాలు నేర్చుకుంటాను అనుకున్నాను. కానీ మంచి వ్యక్తిగా మారేందుకు అవసరమైన పాఠాలని నేర్చుకున్నాను. ఈ మీటింగ్‌ నాకెంతో ప్రత్యేకం. ఆయన నిర్మిస్తున్న సినిమాలో నేను చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

- Advertisement -