కరోనా….ఎమ్మెల్యే సైదిరెడ్డి వీడియో సందేశం

359
shanampudi saidireddy
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో హుజుర్ నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వీడియో ద్వారా ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా వైరస్‌ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిందన్నారు. మనం బాగుండాలి. మన చుట్టూ ఉన్నవారు బాగుండాలి. మన రాష్ట్రం బాగుండాలి. మన దేశం బాగుండాలన్న స్పృహ ఏర్పడిందన్నారు.

యువత ఎక్కువగా ఉన్న దేశం మనది. అవసరం అనేది దేన్నైనా కనిపెట్టడానికి దోహదం చేస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికి ఏదో నైపుణ్యం ఉంటుంది. గోల్‌ ఏర్పరుచుకోండి. మనందరం ఒక కంఫర్ట్‌ జోన్‌లో ఉంటాం. మొదట దానుంచి బయటకు రావాలన్నారు.

మరొవైపు ఆర్థిక సంక్షోభం ఉరుముతుందని, ముందుముందు కష్టపడే రోజులని అంటున్నారు అందరూ. ప్రతీ చిన్న విషయానికి మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. మనం ఇంకొకరి మీద ఆధారపడటం తగ్గిపోవాలన్నారు.

- Advertisement -