టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లో భారత బౌలర్ మహమ్మద్ షమీ మ్యాజిక్ చేశాడు. భారత్ విధించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. 19 ఓవర్లలో 180 పరుగులు చేసిన ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. దీంతో ఆసీస్ విజయం ఖాయమనే అనుకున్నారు అంతా. అయితే చివరి ఓవర్ వేసిన షమీ మ్యాజిక్ చేశాడు.
ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆసీస్ 180 పరుగులకు ఆలౌట్ కాగా ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. కెప్టెన్ అరోన్ ఫించ్ 76 పరుగులు, గ్లెన్ మ్యాక్స్ వెల్ 23 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ అర్థశతకం సాధించడంతో టీమిండియా ఏడు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 75 పరుగులు చేసింది. రాహుల్ 57, సూర్య కుమార్ అర్థసెంచరీతో రాణించగా భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.