BB6..నామినేషన్స్‌లో 13 మంది

226
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 43 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఏడో వారం నామినేషన్స్‌లో భాగంగా 13 మంది ఉన్నారు. అత్యధికంగా 13 మంది రేవంత్‌, బాలాదిత్య, రోహిత్‌, వాసంతి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్‌, ఫైమాలు నామినేషన్స్ లో ఉన్నారు.

సోమవారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ సారి బురద నీళ్లు పోసుకోవాలని నామినేట్ అయిన వాళ్ళు అని బిగ్‌బాస్ చెప్పడంతో ఓ షవర్ నుంచి బురద నీళ్లు పడుతుండగా దాని కింద కూర్చున్నారు నామినేట్ అయిన వాళ్ళు. అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే గీతూ, బాలాదిత్య మధ్యలో విబేధాలు వచ్చాయి.

తర్వాత శ్రీహాన్ ఇనయ మధ్య పెద్ద గొడవే జరుగగా శ్రీసత్య – రేవంత్ మధ్య సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక అర్జున్, ఆదిరెడ్డి అయితే కొట్టుకునేదాకా వెళ్లారు.

- Advertisement -