లక్ష్మణ్‌కు మతిభ్రమించింది:శంభీపూర్ రాజు

633
shambipur raju
- Advertisement -

బీజేపీ లక్ష్మణ్ కు మతిభ్రమించింది …కర్ణాటక తరహాలో తెలంగాణ అంటూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజు…బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.

సీఎం కెసిఆర్ ,కేటీఆర్ , కవితలపై లక్ష్మణ్ దిగజారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో లేరని లక్ష్మణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని….ఉద్యమం లో లేని లక్ష్మణ్ కు ఎలా తెలుస్తుందన్నారు.

కేటీఆర్ పోరాటం గురించి …ఉద్యమంలో కేటీఆర్ మీద కేసులు నమోదయింది లక్ష్మణ్ కు తెలియదా ?
అని ప్రశ్నించారు. లక్ష్మణ్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన రాజు…..తెలంగాణ కు ప్రబల శక్తి కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందు బీజేపీ ఆటలు సాగవు …బీజేపీ కర్ణాటక ఆటలు తెలంగాణ లో నడవవని చెప్పారు.

తెలంగాణ పై మాట మార్చి ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేందుకు బీజేపీ కారణమయ్యింది
..ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ అప్పట్లోనే బీజేపీ తెలంగాణను వంచించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి బీజేపీ ఓర్చుకోలేక పోతోందని …దమ్ముంటే బీజేపీ నేతలు తమ పాలిత రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలన్నారు. బీజేపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించమని చెప్పారు.

- Advertisement -