శంభో శంకర నుండి 3వ పాట…

308
Shambho Shankara
- Advertisement -

శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న `శంభో శంక‌ర`. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు, రెండు పాటలకు విశేష స్పందన లభించింది.. విడుదలైన 3 రోజులకే 30 లక్షల వ్యూస్ ను పొంది ఇప్పటికీ 40లక్షలకు పైగా చేరుకుంది… యూట్యూబ్ లోనే ఇదొక అరుదైన విశేషం అని చెప్పవచ్చు… ఇదిలా ఉంటె… అమలాపురంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘గుచ్చుకున్నావే’ అనే 3వ పాటను ఆవిష్కరించారు.. ఈ చిత్రంలో ఈ పాటే హైలెట్ గా నిలవనుంది.

Shambho Shankara

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. శంకర్ ఒక కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు.. అప్పటినుంచే ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఈ స్థాయికి చేరుకున్నారు… హీరోగా కూడా తాను రాణిస్తాడాని, ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా… పాటలు చాలా బాగున్నాయి.. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు.. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న శంభో శంకర చిత్రాన్ని ఈ నెలాఖరు న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలియచేసారు..

Shambho Shankara

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తాలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

- Advertisement -