కాబోయెవాడి గురించి కవిత్వం చెప్పిన రేణుదేశాయ్..

250
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని, ఆమెకు సరైన భాగస్వామి దొరికినట్టు వార్తలు చేస్తున్నాయి. ఈ తరుణంలో రేణు దేశాయ్ చేసిన పోస్ట్ ఆసక్తి కరంగా ఉంది. ఓ వ్యక్తి చేయి పట్టుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో షేర్‌ చేసింది రేణు. అంతేకాదు ఆ వ్యక్తి గురించి వివరిస్తూ ఓ కవితను కూడా రేణుదేశాయ్ పోస్టు చేయడంతో సంచలనంగా మారింది.

Renu Desai

‘ప్రేమ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. కవితలోనే అది దొరుకుతుందని భావించాను. కొన్ని సార్లు క్యాండిలైట్ డిన్నర్లు – మరికొన్నిసార్లు తీపి అబద్దాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి’.అంటూ రేణు కవితాత్మకంగా చెప్పింది. ‘నీ నిజాయితీ – నీ మాటల్లో నాకు ప్రేమ దొరికింది. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వదిలి వెళ్లకు. నాలో నువ్వు ఆ నమ్మకాన్ని కల్పించావు’ అంటూ కవితను ముగించారు.

రేణుదేశాయ్ చేయిపట్టుకున్న వ్యక్తి ఎవరనేది ఆమె బయటపెట్టలేదు. కేవలం అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కవితరూపంలో వెల్లడించి ఆశ్చర్యపరిచింది రేణు దేశాయ్. దీంతో రేణు కు వ్యక్తి తోడు దొరికిందని.. అతడి గురించే ఆమె కవితలో చెప్పారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. కానీ ఈ కామెంట్స్ పై రేణు స్పందించడం లేదు.

- Advertisement -