శమంతకమణి ట్రైలర్..

267
Shamantakamani Trailer
- Advertisement -

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు నలుగురు హీరోల లుక్‌లను వేరువేరుగా చూపించిన చిత్రయూనిట్.. ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ 10 లక్షల వ్యూస్‌తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

తాజాగా సినిమా  ట్రైలర్  విడుదలైంది. ప్రామెసింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడి మనసులలో ఆలోచనలు రేకెత్తిస్తుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోల పాత్రలు కాస్ట్ లీ కారు చుట్టూ తిరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆదిలు ట్రైలర్ లో తమ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సుధీర్ బాబు తనయుడు దర్శన్, అనన్య సోని, చాందిని చౌదరి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కీలక పాత్రలు పోషించగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆ ట్రైలర్ మీకోసం..

- Advertisement -