అర్జున్ రెడ్డిలో అలా అవ‌కాశం వ‌చ్చింది..

524
ShaliniPandey

అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందొ మ‌న‌కు తెలిసిందే. ముఖ్యంగా యూత్ కు ఈసినిమా ఎక్కువ‌గా ద‌గ్గ‌రైంది. ఈసినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది షాలిని పాండే. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటివ‌లే వ‌చ్చిన మ‌హాన‌టి సినిమాలో కూడా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ప్ర‌స్తుతం శాలిని పాండే తెలుగులో క‌ళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తోంది. అంతేకాకుండా త‌మిళంలో కూడా రెండు సినిమాల‌కు సైన్ చేసింది. త‌న అందం, న‌ట‌న‌తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్ప‌ర‌చుకుంది షాలిని పాండే.

ShaliniPandey

త‌న‌కు న‌ట‌న అంటే చాలా ఇష్టం అని..చిన్నప్ప‌టి నుంచి యాక్ట‌ర్ కావాల‌ని కోరిక ఉండేద‌ని ఓ ఇంట‌ర్యూలో తెలిపింది. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు ఎక్కువ‌గా చూస్తుండేదాన్ని అని..అలా సినిమాల్లోకి రావాల‌ని కోరిక ఉంద‌న్నారు. యాక్ట‌ర్ అయితే విభిన్న పాత్ర‌లు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌ని అనుకున్నాన‌ని తెలిపింది. యాక్ట‌ర్ కాక‌ముందు టీవిలో వ‌చ్చే ప్ర‌తిసినిమాను చూసేదాన్ని అని చెప్పింది. నాకు క‌మ‌ల్ హాస‌న్ అంటే చాలా ఇష్టం అని..చిన్న‌ప్ప‌టి నుంచి క‌మ‌ల్ హాస‌న్ సినిమాలు ఎక్కువ‌గా చూసేదాన్ని అని తెలిపింది. మొట్ట‌మొదట నేను థియేట‌ర్లో చూసిన సినిమా కూడా క‌మ‌ల్ హాస‌న్ దే న‌న్నారు. భామ‌నే స‌త్య‌భామ‌నే సినిమాను మొద‌ట‌గా థియేట‌ర్లో చూసాన‌న్నారు.

ShaliniPandey

ఇక అర్జున్ రెడ్డి లో హీరోయిన్ గా వ‌చ్చిన అవ‌కాశం గురించి చెబుతూ…మా ఫ్రెండ్స్ అంద‌రం క‌లిసి బాలీవుడ్ లో ఆడిష‌న్స్ వెళ్దామ‌ని మాట్లాడుకుంటుంన్నాం. అప్పుడు అందులో ఉన్న ముంబాయ్ కి చెందిన ఓ వ్య‌క్తి నా ఫోటోల‌ను అడిగారు. త‌ర్వాత కొద్ది రోజుల త‌ర్వాత ఆ ఫోటోల‌ను అత‌ను సౌత్ ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు పంపించాడు. కొద్ది రోజుల త‌ర్వాత అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా టీం నుంచి నాకు ఫోన్ వచ్చింది. దాదాపు 300మంది అమ్మాయిల ఫోటోల‌ను చూశామ‌ని అందులో మిమ్మ‌ల్లి సెల‌క్ట్ చేశామ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత సందీప్ ను క‌లిసి క‌థ విని మూడు రోజుల త‌ర్వాత సినిమాకు సంత‌కం చేశా అని చెప్పింది.