కార్తీ ‘చినబాబు’ టీజర్..

193

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి డబ్బింగ్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య చెప్పుకోదగ్గ సక్సెస్ లేక ఇబ్బంది పడిన కార్తిని ఖాకీ మూవీ బాగానే కాపాడింది. తెలుగులో సైతం డీసెంట్ హిట్ అనిపించుకుని వసూళ్ళ పరంగా కూడా సేఫ్ ప్రాజెక్ట్ గా మిగిలింది..

Karthi

అంతకు ముందు కాష్మోరా ఇచ్చిన షాక్ నుంచి కొంత కాలం కోలుకోలేకపోయిన కార్తి స్ట్రెయిట్ మూవీ ఊపిరితో మంచి హిట్టే కొట్టినా ఎక్కువ క్రెడిట్ నాగార్జున ఖాతాలోకి వెళ్ళిపోవడంతో సోలో హిట్ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం.

కార్తీ హీరోగా తమిళంలో పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఈ సినిమా తెలుగులో ‘చినబాబు’గా వస్తోంది. 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై కార్తీ అన్నయ్య, హీరో సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కార్తీ సరసన సయేషా కథానాయికగా నటిస్తోంది. ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, భానుప్రియలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Chinna Babu Official Telugu Teaser | Karthi, Sayyeshaa, Sathyaraj | D. Imman