సన్నీకి సారీ చెప్పిన రాఖీ సావంత్‌..

338
- Advertisement -

బాలీవుడ్‌ ఐటమ్ బాంబ్‌ రాఖీ సావంత్ తన స్టేట్మంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. రాఖీ సావంత్ గతంలో పలు సందర్భాల్లో మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ రాజీవ్ ఖండేల్ వాలా చాట్ షో ‘జజ్ బాత్… సంగీన్ సే నమ్కీన్ తక్’లో పాల్గొన్న సందర్భంగా, హాట్ బ్యూటీ సన్నీలియాన్ కు క్షమాపణలు చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 11 పోటీదారు అర్షిఖాన్ తో కలసి ఈ షోలో పాల్గొన్న రాఖీ, గతంలో తాను సన్నీ గురించి తెలుసుకోకుండా కొన్ని విమర్శలు చేశానని గుర్తు చేసుకుంది.

Rakhi Sawant

సన్నీలియాన్ ఇండస్ట్రీకి వచ్చి హిందీ చిత్రాలు చేయడం ప్రారంభించిన కొత్తల్లో, తాను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని, అందుకు క్షమించాలని కోరింది. సన్నీ గురించి, ఆమె జీవితంలో పడిన కష్టాలను గురించి తనకు ఆ సమయంలో ఏ మాత్రం తెలియదని, ఏమీ తెలుసుకోకుండానే ఆమె సాగించిన ప్రయాణం గురించి వ్యాఖ్యానించడం తప్పేనని చెప్పింది. అప్పట్లో అలా అనుండాల్సింది కాదని అభిప్రాయపడింది.

ఇక శృంగార తార సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఆ తరువాత బాలీవుడ్ స్టార్ గా మారిపోయింది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్స్ కు అన్ని చిత్రపరిశ్రమలలో మంచి డిమాండ్ ఉంది. సన్నీకి కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు ఆసక్తికరమైన చిత్రాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. సన్ని ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం వీరమహాదేవిలో నటిస్తోంది. దదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

- Advertisement -