షాలిని పాండే కష్టాలు వర్ణనాతీతం

25
- Advertisement -

షాలిని పాండే మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలోనే నాటకాల్లో నటించడం ప్రారంభించింది. మొదట్లో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. కొందరు ఆమె పట్ల దురుసుగా కూడా ప్రవర్తించారు. మరికొందరు ఆమెతో అసభ్యంగా కూడా ప్రవర్తించారు. అయినా, ఎలాగైనా హీరోయిన్ గా మారాలని షాలిని పాండే కసితో కష్టపడింది. నిజానికి కొంతమంది అప్రయత్నంగా హీరోయిన్ గా మారుతుంటారు.

షాలిని పాండే లాంటి మరికొందరు మాత్రం ఆ స్టేటస్ కోసం రాత్రిపగలు కష్టపడతారు. హీరోయిన్ గా ఎదగాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందంటే, ఆ వృత్తి తప్ప మరో ప్రొఫెషన్ ను కలలో కూడా ఊహించుకోలేరు. షాలిని పాండే కూడా రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి. హీరోయిన్ గా ఎదగాలని కలలుకంది ఈ హీరోయిన్. దీని కోసం కత్రినా కైఫ్, కంగనా రనౌత్ ను స్ఫూర్తిగా తీసుకుంది. వాళ్లలా ఎదగాలని కష్టపడింది. హీరోయిన్ గా మారడం కోసమే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.

హీరోయిన్ గా ఎదగాలని షాలిని పాండే ఎంత బలంగా భావించిందంటే… కెరీర్ మొదలుపెట్టకముందే దుస్తుల విషయంలో చాలా పట్టుదలతో ఉండేది. తినడానికి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో కూడా షాలిని పాండే వేసిన దుస్తులు మళ్లీ ధరించేది కాదు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుంచి తిట్లు తిన్నప్పటికీ, తన పంథా మార్చుకోలేదని షాలిని పాండే తెలిపింది. అప్పట్లో షాలిని పాండే కష్టాలు వర్ణనాతీతం అట. ఐతే, ఎట్టకేలకు అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా మారిన షాలిని పాండే, ఆ తర్వాత తెలుగులో రాణించలేకపోయింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తోంది.

Also Read:9 మందితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

- Advertisement -