బంపర్ ఆఫర్‌ కొట్టేసిన ‘అర్జున్ రెడ్డి’ భామ..

201
Shalini Pandey
- Advertisement -

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది షాలినీ పాండే. తొలి సినిమాతోనే ఈ భామ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అందాల భామ బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా తరువాత తెలుగు నుంచి ఆశించిన స్థాయిలో ఆమెకి అవకాశాలు రాలేదు. దాంతో తమిళ.. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది.

Shalini Pandey

తాజాగా బాలీవుడ్ లో పరేష్ రావల్ కుమారు ఆధిత్య హీరోగా పరిచయం కాబోతున్న ‘బాంఫాడ్’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘118’ చిత్రంలో షాలిని పాండే ఒక హీరోయిన్‌గా నటిస్తుంది.

- Advertisement -