చిరు టైటిల్‌తో వస్తున్న షకలక శంకర్..

192
Shakalaka Shankar
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ఒకటి ఖైదీ. చిరు మాస్‌ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా ఇప్పటికి ఎవర్‌గ్రీన్‌ మూవే. తాజాగా ఇదే టైటిల్‌తో వస్తున్నాడు షకలక శంకర్.

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’ ఈ చిత్రం విజయదశమి కానుకగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది.

ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. కామెడీ,, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు గొలుసు మాట్లాడుతూ…‘‘చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’ . అలాంటి గొప్ప సినిమా టైటిల్‌ తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్‌ హీరోగా ‘ఖైదీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’’ అన్నారు.

- Advertisement -