త్వరలో ‘డ్రైవర్ రాముడు’ వస్తున్నాడు..

264
- Advertisement -

కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా దూసుకుపోతున్న మన నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరోగా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా మన నవ్వుల వీరుడు షకలక శంకర్ డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, మొదటి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. షకలక శంకర్ హీరోగా నటించిన రెండో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Driver Ramudu

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ… మా సినిమా డ్రైవర్ రాముడు చిత్రీకరణ దాదాపు పూర్తియింది. ప్రస్తుతానికి భారీ సెట్‌లో ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. శివశంకర్ మాస్టరు ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. షకలక శంకర్ సినిమా అవుట్ ఫుట్ చూసి చాల హ్యాపీగా ఉన్నారు. మా నిర్మాతలు కె. వేణు గోపాల్, ఎమ్ ఎల్ రాజు, టీ. కీరత్ బాగా ఖర్చు పెడుతున్నారు. సినిమా చాల బాగా వస్తుంది. త్వరలోనే విడుదల చేస్తాం.

Driver Ramudu

నిర్మాతలు మాట్లాడుతూ “మా డ్రైవర్ రాముడు సినిమా ఊహించిన దానికంటే చాల బాగా వచ్చింది. మా దర్శకుడు రాజ్ సత్య భారీ సినిమా లాగా చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యాప్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ప్రస్తుతానికి భారీ సెట్‌లో యువతని ఉరుతలూగించే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము” అని తెలిపారు.

Driver Ramudu

ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్, తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.. బ్యానర్- సినిమా పీపుల్స, సమర్పణ – మాస్టర్ ప్రణవ్ తేజ్, మ్యూజిక్ – సునీల్ కశ్యాప్, ఆర్ట్ – రఘు కుల్ కర్ణి, డిఓపి – అమర్ నాథ్, నిర్మాతలు – K. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్ ,దర్శకత్వం – రాజ్ సత్య.

- Advertisement -