‘సరైనోడు’ సరికొత్త రికార్డ్..

231
allu arjun sarainodu
- Advertisement -

భారతీయ సినీ చరిత్రలోనే అల్లు అర్జున్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆయన నటించిన ‘సరైనోడు’ హిందీ వెర్సన్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ సినిమాలలో అత్యంత ప్రేక్షకాధరణ పొందిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని 200,635,52మంది వీక్షించారు. ఆరు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఇంతవరకు ఏ భారతీయ సినిమా అందుకోని అరుదైన ఘనతను సరైనోడు అందుకుంది.

Sarainodu-Allu

బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని.. హిందీ వెర్షన్ యూట్యూబ్ హక్కులను గోల్డ్ మైన్స్ దక్కించుకుంది. మాస్ అండ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 127 కోట్ల వసూలు చేసి, అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకులు ప్రీతిసింగ్, కేథరిన్ నటించారు. హీరో శ్రీకాంత్ బాబాయ్ పాత్రలో నటించగా.. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో బన్నీ యాంగ్రీమెన్ గా గణ అనే పాత్రలో కనిపించాడు. బన్నీకి తగ్గటుగానే.. ఆది కూడా మంచి యాంగ్రీవిలన్ గా కనిపించాడు.

- Advertisement -