సెన్సార్ పూర్తి చేసుకున్న శైలజారెడ్డి అల్లుడు..

100
Shailaja Reddy Alludu

నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. మారుతి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో నటిస్తోంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Shailaja Reddy Alludu

ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్‌,ట్రైలర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసిందని కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర దర్శకుడు మారుతీ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు.