జంట పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష ..

382
- Advertisement -

పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని జంట పేలుళ్ల కేసులో నేరస్తులకు న్యాయస్థానం సోమవారం ఉరిశిక్ష విధించింది. దోషులకు చర్లపల్లి ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఏ1 నిందితుడైన అనిక్ షఫిక్ సయ్యద్, ఏ2 నిందితుడైన అక్బర్ ఇస్మాయిల్‌లకు ఉరిశిక్ష పడింది. తారిక్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2007 ఆగస్టు 25న జరిగిన పేలుళ్లలో 44మంది మృతిచెందగా, 68మందికి పైగా గాయపడ్డారు. ఈకేసుకు సంబంధించిన కోర్టు 125మంది ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించింది. సుమారు 11 ఏళ్ల పాటు కేసు విచారణ జరిగింది.

Hyderabad bomb blasts case

లుంబినీ పార్కులోని లేజర్‌ షో వద్ద బాంబు పెట్టిన అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్‌(ఏ1), దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కింద బాంబు పెట్టిన మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి(ఏ2)లను చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 4న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు నిందితులు ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌ టార్కస్‌, మహ్మద్‌ సాదిక్‌ ఇస్రార్‌ అహ్మద్‌ షేక్‌‌ను నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల అనంతరం నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజుం హసన్‌‌కు ఏవజ్జీవ ఖైదు విధించింది.

- Advertisement -