ముద్దేకదాని పెట్టేస్తే పెదాల్ని కోస్తా..

217
Shahrukh Khan Warning His Son Aryan
- Advertisement -

ప్రముఖులు సినిమా స్టార్స్‌ కొందరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.అయితే అది సినిమాల గురించో..రాజకీయాల గురించో అయితే మామూలే.అలా కాకుండ తమ వ్యక్తిగత అంశాలకు సంబంధించి. తమ కుటుంబం గురించి..సంచలన వ్యాఖ్యలు చేయటం విశేషం.అయితే కుటుంబ సభ్యుల గురించి తక్కువగా ప్రస్తావించే సినీ ప్రముఖులు ఈ వ్యాఖ్యలు చేయడం ఇంకా విశేషం.. మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. తన కుమార్తె సినిమాల్లోకి రావటం తనకేమాత్రం ఇష్టం లేదని చెప్పటమే కాదు.. చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చుగా అంటూ తన కూతురికి ఉచిత సలహాను ఇచ్చేశారు.

Shahrukh Khan Warning His Son Aryan

తాజాగా ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. తన కొడుకు విషయంలో తాను కచ్ఛితంగా ఉంటానని.వారు ఎలాంటి తప్పు చేసినా ఊరుకోబోనని ఓ సందర్బంలో చేప్పాడు.అయితే క్రమశిక్షణ తప్పితే భారీ శిక్ష తప్పదన్నట్లుగా చెప్పాడు. కొడుకు ఆర్యన్ కానీ ఎవరైనా అమ్మాయికి ముద్దు ఇస్తే అతడి పెదాల్ని కోసేస్తానని చెప్పాడు.

మరి గతంలో తన కుమార్తె సుహానా గురించి చెబుతూ. సుహానాను ప్రేమించే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పటం తెలిసిందే. సుహానాని కానీ అతడి బాయ్ ఫ్రెండ్ ముద్దుపెట్టుకున్నట్లు తెలిస్తే వాడి పెదాల్ని కోసేస్తానని చెప్పాడు. తాజాగా కొడుకు విషయంలోనూ ఇదే మాటను చెప్పటం గమనార్హం. తన కొడుకు ముద్దు ఇచ్చినా.. తన కొడుక్కి అతడి గాళ్ ఫ్రెండ్ ముద్దు ఇచ్చినా.. డేంజర్ మాత్రం తన కొడుక్కేనని.. శిక్ష కూడా అతడికేనంటూ చెబుతున్న మాటలు ఇప్పడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

- Advertisement -