‘డీజే’.. రిలీజ్‌ కష్టమే..బన్ని ఫ్యాన్స్‌కి షాక్‌..!

321
- Advertisement -

ఇప్పటికే పవన్‌ ఫ్యాన్స్‌ తాకిడి బన్నీ’డీజే’ విషయంలో కాస్త కంగారుపడ్డ విషయం తెలిసిందే. చెప్పను బ్రదర్‌ అన్న ఒక్కమాటతో అల్లు అర్జున్‌ కి యాంటీగా మారిపోయారు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌. అప్పటినుంచి బన్నీ విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ ఘరంగానే ఉన్నారు.

ఇదే క్రమంలో బన్ని లెటెస్ట్‌ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ పై డిజ్‌ లైక్‌ లతో విరుచుకుపడ్డారు. డీజే నుంచి వచ్చే లెటెస్ట్‌ అప్‌డేట్స్‌పై ఏదో రకంగా నెగిటివ్‌ టాక్‌ వస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. ‘డీజే’ రిలీజ్‌ విషయంలో బన్నీ కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తున్నాడు.

  No Duvvada Jagannadham Benefit Shows..

అందుకే డీజే కి బెనిఫిట్‌ షోలు లేవు అంటూ .. ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు బన్నీ. దువ్వాడ జగన్నాథం ‘డీజే’ మూవీ బెనిఫిట్ షో రిలీజ్‌ కి నో చెప్పేశాడు. దీంతో ఫాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌ హడావిడి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. బెనిఫిట్ షోల హంగామా మామూలుగా ఉండదు. అర్ధరాత్రి అందరికంటే ముందే సినిమా చూడడం అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది.

   No Duvvada Jagannadham Benefit Shows..

కానీ గతకొంతకాలంగా బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు అంటే స్టార్స్ కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ బెనిఫిట్ షోల కారణంగా నెగెటివ్ టాక్ వచ్చే ప్రమాదముందని, తెల్లవారుజామున షో పడే టైమ్‌కి యాంటీ ఫ్యాన్స్ కావాలని ఫ్లాప్ టాక్ స్ర్పెడ్ చేస్తున్నారని, దాని వలన మొదటిరోజు కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందని స్టార్లు ఈ బెనిఫిట్ షోలంటే కాస్త భయపడుతున్నారు.

అందుకే బెనిఫిట్ షో అంటే నో అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ ‘డీజే’ మూవీ బెనిఫిట్ షో రిలీజ్‌కి ససేమిరా అంటున్నాడట.

  No Duvvada Jagannadham Benefit Shows..

గతంలో సరైనోడు సినిమా టైమ్‌లో బన్నీ బెనిఫిట్ షోలకు అంగీకరించలేదు. ఇప్పుడు ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకు కూడా నో బెనిఫిట్ షోస్ అంటున్నాడట. ఒక రకంగా చెప్పాలంటే.. ‘డీజే’ విషయంలో ఇప్పుడు మరింత చాకచక్యంగా వ్యవహరించాలని, అందుకే బెనిఫిట్‌ షోకి బన్ని నో చెప్పాడంటూ ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అయితే అభిమానులు ఎంత బలవంతపెడుతున్నా.. ఆయన మాత్రం అర్ధరాత్రి షోలకు అంగీకరించడం లేదు.

  No Duvvada Jagannadham Benefit Shows..

నైజాం ఏరియాలో దాదాపుగా బెనిఫిట్ షోలు లేనట్లే.. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉదయం ఆరు గంటల నుండి షో పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ డీజే బెనిఫిట్ షో కోసం నిర్మాత దిల్ రాజుతో పలు సంప్రదింపులు జరుపుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక ప్రకారం ‘డీజే’ ను ముందే వాయించడానికి ఒప్పుకుంటారో లేక బన్నీ మాట ప్రకారమే నో చెప్తారో చూడాలి.

- Advertisement -