షారుఖ్ – నయనతార ముచ్చట్లు

13
- Advertisement -

నయనతార బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి చిత్రం.. జవాన్. పైగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో ఆమె కలిసి నటించింది. ఈ నెల 7న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఈ భామ చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చింది. మరి ఆ ముచ్చట్లు ఏమిటో నయనతార మాటల్లోనే విందాం. నయనతార మాట్లాడుతూ.. ‘జవాన్’ షూటింగ్ జరుగుతున్నప్పుడే నేను ఈ సినిమాను ఒప్పుకున్నాను. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించా. నా పాత్ర సినిమా కథకు కీలకం. పాటలు కోసం ఉండే హీరోయిన్ పాత్ర కాదు నాది.

డైరెక్టర్ అట్లీ అద్భుతంగా నా పాత్రను తీర్చిదిద్దారు. అంతకన్నా అద్భుతంగా తీశారు’ అంటూ నయనతార చెప్పుకొచ్చింది. ‘ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. హిందీ ఇప్పుడు అర్థం అవుతోంది. త్వరలోనే మాట్లాడే స్థాయిలో నేర్చుకుంటాను. ఇక షారుఖ్ ఖాన్ పెద్ద స్టార్. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. ఈ షూటింగ్ టైంలో ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశారు. చాలా మందికి తెలియదు నయనతార షారుఖ్ కి పెద్ద అభిమాని. అందుకే, ఈ సినిమా జరుగుతున్న అంతసేపూ నేను బాగా ఎంజాయ్ చేశాను అంటూ నయనతార హ్యాపీగా ఫీల్ అయ్యింది.

ఏది ఏమైనా నయనతార పై కూడా షారుఖ్ ఖాన్ కూడా పొగడ్తల వర్షం కురిపించింది. షారుఖ్ మాట్లాడుతూ.. ‘నయనతార అందమైన, అద్భుతమైన నటి. నయనతార తన పాత్రకు వన్నె తెచ్చింది. తమిళ ప్రేక్షకులు మరోసారి ఆమెతో ప్రేమలో పడుతారు. హిందీ ప్రేక్షకులు ఆమె శ్రమని అభినందిస్తారు. ఈ సినిమాలో నయనతార పోలీసు అధికారిగా నటిస్తోంది. సో, ఆమె గ్లామర్ తో పాటు “యాక్షన్” కూడా చేస్తోంది అంటూ షారుఖ్ ఖాన్ మాట్లాడారు.

Also Read:రామ్ ‘స్కంద‌’ పై రాజకీయం?

- Advertisement -