ప్చ్.. ఆ స్టార్ హీరో కూతురు కూడానా!

267
- Advertisement -

నేపోటిజం పై బాలీవుడ్ లో వ్యతిరేకత బోర్డర్స్ దాటిపోయింది. అయినా కొడుకుల‌ను కూతుర్లను హీరోహీరోయన్లుగా జ‌నం మీద రుద్దుతూనే ఉన్నారు హిందీ మేకర్స్. వారసుల ప‌ర్స‌నాలిటీ బాగాలేకపోయినా.. జ‌నాలు క్ర‌మక్ర‌మంగా వారికి అల‌వాటు ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులున్నాయి. సరే హీరోలు అంటే ఓకే.. చివరకు హీరోయిన్ల‌ను కూడా జ‌నాలు త‌ప్ప‌నిస‌రిగా భ‌రించాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తడం కొసమెరుపు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ఎటు చూసినా హీరోయిన్లంతా సినీవార‌స‌త్వం నుండి వ‌చ్చిన వాళ్లే. గ్లామ‌ర్ , డీ గ్లామ‌ర్ అనే తేడా లేకుండా.. అందరూ వాళ్ళే.

అందం అభినయం లేకపోయినా సినీవార‌సురాళ్లు హిందీ పరిశ్రమను దున్నేస్తున్నారు. వారినే ఆహా..ఓహో.. అంటూ నెత్తికెత్తుకుంటున్నారు. ఇలాంటి ప‌రంప‌ర‌లో మ‌రో వార‌సురాలు గ్లామ‌ర్ పాట్ల‌ను ప‌డుతోంది. ఈమె.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్. చిన్న‌ప్ప‌టి నుంచి సుహానా ఖాన్ ను చూసిన వారెవ‌రూ ఆమెలో హీరోయిన్ మెటీరియ‌ల్ ఉంద‌ని భావించి ఉండ‌రు. ఎవ‌రేమ‌నుకున్నా.. షారుఖ్ కూతురు సుహానా ఖాన్ మాత్రం హీరోయిన్ అయిపోవడానికి రెడీ అయిపోయింది.

‘ది అర్చీస్’ అనే చిత్రంలో సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. టైగర్ బేబీ ప్రొడక్షన్స్‌ తో కలసి నెట్‌ ఫ్లిక్స్ దీనిని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది నేరుగా నెట్‌‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఇప్పుడు సుహానా ఖాన్ వంతు వ‌చ్చింది. దీని కోసం ఆమె సోష‌ల్ మీడియా ను తెగ ఉప‌యోగించుకుంటూ ఉంది. అక్క‌డ సుహానా ఖాన్ తన గ్లామ‌ర‌స్ పోజుల‌ను ఇస్తూ ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. సుహానా ఖాన్ య‌మ హాట్ అని నిరూపించే ప్ర‌య‌త్నం గ‌ట్టిగానే జ‌రుగుతోంది!

ఇవి కూడా చదవండి…

కైకాల ట్రాక్ రికార్డ్ అపూర్వం

అందంతో మతిపోగోడుతున్న స్నేహ

ఉఫ్..హిట్ ఇస్తే ఛాన్స్ ఇస్తా!

- Advertisement -