ఉఫ్..హిట్ ఇస్తే ఛాన్స్ ఇస్తా!

28
- Advertisement -

వకీల్ సాబ్ సినిమాతో దర్శకుడు వేణు శ్రీరామ్ పేరు గట్టిగా వినిపించింది. ఆ తరువాత బన్నీతో ఐకాన్ అంటూ ఓ సినిమా పై కసరత్తులు చేస్తున్నాడు. కానీ, పుష్ప తెచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ నేపథ్యంలో బన్నీ.. వేణు శ్రీరామ్ ను నమ్ముతాడా?, డౌటే. మరి బన్నీతో కుదరకపోతే వేణు శ్రీరామ్ తర్వాత సినిమా ఏంటీ అన్నది ఇక్కడ పాయింట్. ఇదే పాయింట్ దగ్గర డౌట్ పడ్డాడు వేణుశ్రీ రామ్ కూడా. అందుకే ఈ లోపు మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి వేణు శ్రీరామ్ కి మరో మంచి ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. హీరో వరుణ్ తేజ్ కు రెండు కథలు చెప్పగా ఒకదాన్ని ఓకె చేశాడని తెలుస్తోంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కథను వరుణ్ తేజ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వకీల్ సాబ్ తో దర్శకుడు వేణు శ్రీరామ్ కు క్రెడిట్ రావాల్సిందే కానీ, అది పక్కా రీమేక్ కావడంతో రావాల్సినంత క్రెడిట్ రాలేదు.

ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే వేణు శ్రీరామ్ కెరీర్ సెటిల్ అయిపోతుంది. కారణం ఈ సినిమా హిట్ ఐతే, ఛాన్స్ ఇస్తా అని బన్నీ మాట ఇచ్చాడు. అంటే.. వేణు శ్రీ రామ్ కి ఇప్పుడు రాబోయే హిట్.. బన్నీ డేట్స్ ను తీసుకొస్తోంది. మరి వేణు శ్రీ రామ్ ఏం చేస్తాడో చూడాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వేణు శ్రీ రామ్ ది మూడో ప్రాజెక్ట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి…

శాంతాక్లాజ్‌ అవతారమెత్తిన యాంకర్‌ శ్యామల

కైకాల మృతి.. పలువురు నేతల సంతాపం

డోస్‌ పెంచిన అనుపమ..

- Advertisement -