లాస్ ఏంజిల్స్‌లో క్రికెట్ స్టేడియం

1
- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో పొమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో సరికొత్త, ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంను అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త వేదిక రాబోయే లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడల సమయంలో క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అమెరికాలో ఈ క్రీడ విస్తరణకు ఇదొక అత్యంత కీలకమైన అడుగు.

లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా ఉన్న షారుఖ్ ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది కేవలం క్రీడల కోసమే కాకుండా వినోదానికి మరియు కుటుంబాలంతా కలిసి ఆనందించడానికి ఒక అద్భుతమైన ప్రదేశమని పేర్కొంటూ.. ఈ ప్రయాణంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఎస్‌ఆర్‌కే (SRK) కృతజ్ఞతలు తెలిపారు.

ఒక కలగా ప్రారంభమైన ప్రయాణం… ఈరోజు నిజమైంది. లాస్ ఏంజిల్స్‌లోని ‘నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్’కు మీ అందరికీ సాదర స్వాగతం. ఇది కేవలం క్రీడల కోసమే కాదు, వినోదం కోసం, కుటుంబాల కోసం… ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను పంచుకోవడం కోసం నిర్మించబడింది. ఈ ప్రయాణంలో ఎంతో అండగా నిలిచిన జైభాయ్ (@JayShah), ఐసీసీ (@ICC) మరియు సంజోగ్ (@Sanjog_G)లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు షారుఖ్‌.

ఇది లాస్ ఏంజిల్స్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కోసం మరియు మా నైట్ రైడర్స్ కుటుంబం కోసం. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్‌కు స్వాగతం,” అని ఆయన జోడించారు.లాస్ ఏంజిల్స్, పొమోనా కౌంటీలోని ఈ ‘నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్’ తన మొట్టమొదటి అధికారిక పోటీ క్రికెట్ మ్యాచ్‌కు కూడా వేదిక కానుంది.

ALso Read:తొలిసారి న్యూజిలాండ్‌కు మోదీ

- Advertisement -