ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రతినిధి బృందం

1
- Advertisement -

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తరుణంలో అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన చర్చలకు తాత్కాలిక విరామం లభించింది. మరోవైపు, ఈ సున్నితమైన సమయంలో ఇరాన్‌పై ఎలాంటి దాడి లేదా తప్పుడు అంచనాలు వేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సైన్యం అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరించింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల ప్రక్రియ జూలై 4 నుండి జూలై 9 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మతపరమైన కాంప్లెక్స్‌కు చేరుకుంది.

ఈ అంత్యక్రియల కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా సుమారు 1.5 నుండి 2 కోట్ల మంది ప్రజలు, అలాగే 30 దేశాల ప్రతినిధులు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భారతదేశం తరఫున విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్‌లతో కూడిన బృందం ఇరాన్ బయలుదేరింది. ఖమేనీ మరణం తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఈ అంత్యక్రియల్లో బహిరంగంగా కనిపిస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

మరోవైపు ఖతార్ రాజధాని దోహాలో మధ్యవర్తుల ద్వారా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు.ఇరాన్ తో చర్చల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. ఇది పెద్ద యుద్ధం కాదు, కేవలం ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చే ప్రక్రియ మాత్రమే అని పేర్కొన్నారు.

Also Read:EPFO సంచలన నిర్ణయం

జూన్ 17న కుదిరిన 14-అంశాల తాత్కాలిక ఒప్పందం ప్రకారం రాబోయే 60 రోజుల్లో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేలా తుది చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఖమేనీ అంత్యక్రియల కారణంగా ప్రస్తుతం ఈ చర్చలు కనీసం వారం రోజుల పాటు నిలిపివేయబడ్డాయి.

- Advertisement -