ప్రేమను ప్రేమిస్తానన్న షారుఖ్..

197
- Advertisement -

టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఫీలయ్యే మాటొకటి బయటపెట్టేసింది ప్రేయసి అనుష్క శర్మ. ప్రియుడిని ప్రక్కన పెట్టి.. షారుక్ ని కింగ్ ఆఫ్ రొమాన్స్ అనేసింది.

Shah Rukh Khan can even romance...

ఇది వింటే కోహ్లీ ఫీలవుతాడేమో. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ? షారుక్‌తో రొమాన్స్‌ చేయడం చాలా ఈజీ అని, రొమాన్స్‌ చేసేటప్పుడు అతని కళ్లలో నిజాయితీ కనబడుతుందని తన మనసులో మాటని సోషల్‌ మీడియాలో చెప్పేసింది బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ.

అంతటితో ఆగకుండా షారుక్‌ చివరికి మైక్రోఫోన్‌తో కూడా రొమాన్స్‌ చేయగలడని చెప్పుకొచ్చింది. అయితే దీనికి రిప్లై ఇచ్చిన షారుక్‌.., నువ్వు మైక్‌ పట్టుకున్నంత కాలం రొమాన్స్‌ చేయగలను డార్లింగ్‌ అని నవ్వుతూ కామెంట్‌ చేశాడు.

Shah Rukh Khan can even romance...

ఇక ఇప్పటికే రబ్‌ నే బనా దీ జోడీ, జబ్‌ తక్‌ హై జాన్‌ చిత్రాల్లో నటించిన అనుష్క, షారుక్‌ తాజాగా ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’లో మూడో సారి జత కట్టారు. ఈ చిత్రం ఆగష్టు 4న విడుదల కానుంది.

- Advertisement -