శబరిమల ఆలయం..సూచనలివే

4
- Advertisement -

కేరళలోని ఆధ్యాత్మిక క్షేత్రం, అయ్యప్ప స్వామి సన్నిధానం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ లో భాగంగా ఆలయాన్ని తెరిచారు. ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో ఆలయం తలుపులు తెరిచారు.

ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు కొత్త పూజారులు తలుపులు తెరవడంతో తీర్థయాత్ర సీజన్ ప్రారంభం అవుతుంది. నేటి నుంచి యాత్రికులను అయ్యప్ప దర్శనం కోసం అనుమతించారు. ఆలయం తలుపులు తెరవడంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం. మళయాలంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పలు చోట్ల ఎమర్జెన్సీ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది.

()వ్యాధులకు చికిత్స పొందుతున్న భక్తులు తమ వెంట వైద్య రికార్డులు తెచ్చుకోవాలి.
()శబరి యాత్రకు కొన్ని రోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
()పంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు నిదానంగా వెళ్లాలి. అక్కడక్కడ రెస్ట్ తీసుకోవాలి.
()కొండను ఎక్కే సమయంలో అలసటగా అనిపించినా, ఛాతిలో నొప్పి వచ్చినా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించినా.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నెంబర్ కు కాల్ చేయాలి.
() కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
() విష కీటకాలు కరిస్తే వెంటనే 04735 203232 నెంబర్ కు కాల్ చేయాలి.

Also Read:BB9:ప్రేక్షకుల నిరాశ!

- Advertisement -