BB9:ప్రేక్షకుల నిరాశ!

11
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు 10 వారాలు పూర్తి చేసుకోవడానికి వచ్చింది. అయితే ఈసీజన్ చప్పగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ప్రేక్షకాదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

షో రేటింగ్స్, డిజిటల్ వ్యూయర్‌షిప్ రెండూ పడిపోవడంతో, ఉత్సాహం తగ్గిపోయిందన్న చర్చలు అభిమానుల్లో మొదలయ్యాయి. గేమ్ చాలా ముందే అంచనా వేసేయగలిగినట్టుగా మారిపోయిందని, కొంతమంది కంటెస్టెంట్లకు మేకర్స్ ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నారన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది.

పక్షపాత భావన, పదే పదే వచ్చే టాస్కులు, ఆసక్తికరమైన డ్రామా లేకపోవడం—ఇవి అన్నీ కలిపి లాయల్ ఫాలోవర్స్‌ను నిరాశపరిచాయి.

Also Read:పీఎం కిసాన్‌..డేట్ ఫిక్స్!

- Advertisement -