గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. తెలుగు, హిందీ, తమిళ భాషలలో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమాగా తెరకెక్కుతోంది. దేవ్ మోహన్ ఇందులో దుష్యంతుడు పాత్ర పోషించగా అల్లు అర్జున్ కూతురు అర్హ కీ రోల్ పోషించారు.ఇటీవలె సినిమా షూటింగ్ పూర్తికాగా త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు.
ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంత ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. అడవిలో తెల్లని దుస్తువులు ధరించి దేవకన్యలా అందంగా కన్పిస్తోంది సామ్. ఆమె తేజస్సు, చుట్టూ జంతువులు చేరడం ప్రేక్షకులను మరో ఫాంటసీ లోకానికి తీసుకెళ్తుంది.
మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఈ చిత్ర తారాగణంలో భాగం కానున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.