బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఫోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల వైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె పోర్న్ జీవితాన్ని పూర్తిగా వదిలేసి సినిమాలకు మాత్రమే పరిమితమైంది. తాజాగా ఆమె జీవితం ఆధారంగా ‘కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ పేరుతో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. సన్నీలియోన్ జీవితంలో ఎదుర్కున్న కష్టాలను, ఆమె పోర్న్ స్టార్ గా మారడానికి గల కారణాలను ముఖ్యంగా ఈసినిమాలో చూపించనునన్నారు. అయితే దీన్ని సినిమాలా కాకుండా ఓ వెబ్ సిరిస్ లా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇప్పుడు సన్నీ లియోన్ కొత్త వివాదంలో చిక్కుకుంది. సన్నీ నటిస్తున్న ‘కరణ్‌జిత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’ టైటిల్ విషయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. టైటిల్‌లో ‘కౌర్’ను అంగీకరించే ప్రసక్తే లేదని, తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది. సన్నీలియోన్ సిక్కు మత విశ్వాసాలను పాటించడం లేదని, కాబట్టి ఆ పేరును ఉపయోగించడం తగదన్నారు.
అసలా పదాన్ని ఉపయోగించే హక్కే ఆమెకు లేదని అన్నారు. ‘కౌర్’ అనే పదంను ఉపయోగించడం వల్ల సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ఎస్‌జీపీసీ అడిషనల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి దల్జీత్ సింగ్ బేడీ అన్నారు. అంతేకాదు సన్నీలియోన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.