బీజేపీకి గట్టి షాక్.. గులాబీ గూటికి బీజేపీ కౌన్సిలర్..

17

హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ పరిస్థితి రోజురోజుకు మసకబారుతుంది అని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.మంగళవారం హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్‌తో పాటు ముఖ్య అనుచరులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ పార్టీకి స్థానం లేదని గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు క్యూ కడుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ వెంట మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్,గందే శ్రీనివాస్ ,ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.