‘మహా సముద్రం’ డబ్బింగ్ పూర్తి..

57

విభిన్న కథలను ఎంచుకుంటూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంగా అనిల్ సుంకర నిర్మాణంలో నిర్మితమైంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahasamudram

ఈ నేపథ్యంలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఆ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీరావు నటించారు. ఇక జగపతిబాబు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. ‘గరుడ’ రామ్ పోషించిన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.