ఆకట్టుకుంటున్న ‘సీరియ‌స్‌ మెన్’.. ట్రైల‌ర్

209
Nawazuddin Siddiqui
- Advertisement -

బాలీవుడ్ నటుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ న‌టిస్తోన్న చిత్రం సీరియ‌స్‌ మెన్. సుధీర్ మిశ్రా డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ చిత్రంలో నాజ‌ర్‌, శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఓ ట్రైల‌ర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ట్రైల‌ర్ విషయానికొస్తే.. మ‌ధ్య‌త‌ర‌గతి కుటుంబానికి చెందిన వ్య‌క్తి పాత్ర‌లో న‌వాజుద్దీన్ క‌నిపిస్తున్నాడు. అయితే తాను అనుకున్న‌ది న‌వాజుద్దీన్ సాధించ‌లేక‌పోతాడు. త‌న కుమారుడు ఇంటెలిజెంట్‌గా పేరు ప్ర‌ఖ్యాతులు పొందాల‌ని కోరుకుంటాడు.

న‌వాజుద్దీన్ అనుకున్న‌ట్టుగానే అత‌ని కొడుకు స్మార్ట్ కిడ్ గా మీడియా, రాజ‌కీయ‌వేత్త‌ల దృష్టిని ఆక‌ర్షిస్తాడు. ఈ క్ర‌మంలో ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో సాగే ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఓ తండ్రి తన పిల్ల‌లపై ఎలాంటి ఆశ‌లు పెట్టుకుంటారో తెలియ‌జేస్తూ సాగే ట్రైల‌ర్ ప్ర‌తీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాన్ని ట‌చ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ సాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఈ న‌టుడు ఇపుడు స‌రికొత్త క‌థాంశంతో సీరియ‌స్ మెన్ గా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.

- Advertisement -