GHMC ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష..

278
Telangana State Election Commissioner
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుధ్ద ప్రకాష్ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కు మొదటి సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి, 2016 లో జరిగాయి. దాని ఐదేళ్ల పదవీకాలం 10.02.2021 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన అన్ని పనులను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలని జిహెచ్ఎంసి అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు.

టి పోల్ సాఫ్టవేర్‌ పైన జోనల్ అధికారులు డిప్యూటీ కమిషనర్ లు ఈఆర్వో లకు అవగాహన కల్పించాలని అని నిర్ణయించారు. ఓటర్ల జాబితాను సక్రమంగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. 2016లో 45.29% నమోదు అయిన పోలింగ్ ను ఈసారి పెంచాలని అందుకోసం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం ద్వారా ఎన్నికల్లో పొరపాట్లను జరగకుండా చూసుకోవాలన్నారు.

కోవిడ్ నేపథ్యంలో ఈవీఎం మిషన్స్ వాడాలా లేదంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలా అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 కి మించ కుండా ఓట్లు ఉండాలని నిర్ణయించారు. అక్టోబర్ 2వ వారంలో మరొకసారి జోనల్ కమిషనర్లు మరియు డిప్యూటీ కమిషనర్ లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -