పోలీసు శాఖకు స్పెషల్‌ జోన్స్‌..

265
Separate Zones for Police department
- Advertisement -

భారత ప్రభుత్వం తెలంగాణ నూతన జోనల్ విధానానికి ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్లు ఒక మల్టీ జోన్‌గా , యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు కలిపి మరో మల్టీ జోన్‌గా ఏర్పడ్డాయి. కాగా..మొత్తం జోన్లు కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. అయితే పోలీసు శాఖ మినహా అన్ని శాఖలకు జోన్ల వర్తింపు జరగనుంది. పోలీసు శాఖ కోసం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేశారు.

పోలీసు శాఖ ప్రత్యేక జోన్ల వివరాలు :

-కాళేశ్వరం జోన్‌లో భూపాలపల్లి జయశంకర్, ఆసిఫాబాద్ కుమ్రంభీం, రామగుండం పోలీసు కమిషనరేట్ రానుంది.
-బాసర జోన్‌లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్, జగిత్యాల రానున్నాయి.
-రాజన్న జోన్‌లో కరీంనగర్ పోలీసు కమిషనరేట్, సిద్దిపేట పోలీసు కమిషనరేట్, సిరిసిల్ల రాజన్న, కామారెడ్డి, మెదక్ రానున్నాయి.
-భద్రాద్రి జోన్‌లో కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం పోలీసు కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.
-యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీసు కమిషనరేట్ రానున్నాయి.
-చార్మినార్ జోన్‌లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, సంగారెడ్డి రానున్నాయి.
-జోగులాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జోగులాంబ, నాగర్‌కర్నూల్, వికారాబాద్ రానున్నాయి.

- Advertisement -