హరికృష్ణ మా అన్నగారి బిడ్డ – మోహన్ బాబు

252
Mohan Babu reacts on harikrishna demise..
- Advertisement -

నటుడు నందమూరి హరికృష్ణ అకాలమరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుందని , తన జీవితం లో అత్యంత విలువైనదని కోల్పోయినట్టుగా ఉన్నదని నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేసారు. అంతేకాదు. హరికృష్ణ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Mohan Babu reacts on harikrishna demise..

 

” నేను ఇండియాలో లేను, అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా ఒక్కసారిగా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు. మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ రోజు మొదలైన మా అనుబంధం ఈ నాటికి కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Mohan Babu reacts on harikrishna demise..

కాగా మరి కాసేపట్లో హరికృష్ణ అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలను చూసేందుకు ఆయన అభిమానులు వేలాదిగా మహా ప్రస్థానం వైపు తరలివెళ్తున్నారు.

- Advertisement -