ఢిల్లీ పేలుడు ఘటన..సంచలన నిజాలు

5
- Advertisement -

ఢిల్లీ పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ చేపట్టాయి. ఐ20, ఎక్ స్పోర్ట్ వాహనాలే కాకుండా మరో రెండు పాత కార్లలోనూ బాంబులు అమర్చి పేలుళ్లకు సిద్ధం చేయాలని నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

మరోవైపు, నాలుగు నగరాల్లో ఇద్దరు చొప్పున పేలుళ్లకు ప్లానింగ్ చేసినట్లు సమాచారం. ప్రతి గ్రూప్ నుంచి భారీగా ఈఐడీ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారుల సమాచారం.

పేలుళ్లకు మొత్తం 8 మంది అనుమానితులు కుట్ర పన్నినట్లు వెల్లడించాయి దర్యాప్తు సంస్థలు. ఎర్రకోట వద్ద పేలుడు జరిపింది డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ నిర్థారణ అయింది. ఉమర్ నబీ తల్లి డీఎన్ఏ నమూనాతో సరిపోలినట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య ఇరుక్కున్న కాలు నుంచి డీఎన్ఏ సేకరణ చేశారు.

Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!

- Advertisement -