సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. గత కొద్ది రోజులుగా, ‘స్పిరిట్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్‌కు తండ్రి పాత్ర పోషిస్తున్నారంటూ పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి ప్రభాస్ తండ్రిగా గానీ, మరే ఇతర పాత్రలో గానీ నటించడం లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది.
దక్షిణ కొరియా నటుడు డాన్ లీ విలన్ పాత్ర పోషిస్తున్నారా అని ప్రశ్నించగా, సందీప్ రెడ్డి వంగ దాన్ని ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఆయన మౌనం అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుంది. ఈ నెలలోనే పూజా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల కానుంది.
‘యానిమల్’ సినిమాతో ప్రాచుర్యం పొందిన నటి తృప్తి డిమ్రీ, ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనుండా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read:తోట తరణికి అత్యున్నత పురస్కారం

