బన్నీ సినిమాలో టబు లుక్ చూశారా?

591
Tabu in AA19
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈచిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

ఇక ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఈమూవీ షూటింగ్ లో పాల్గోంది. ఆమెఎంట్రీకి సంబంధించిన చిన్న వీడియోను హారిక అండ్ హాసిని సంస్థ రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్కినేని సుశాంత్, నవదీప్ లు ఈమూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈమూవీ షూటింగ్ నవంబర్ లోపు పూర్తీ చేసి 2020సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. బన్ని త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ మూవీ కావడంతో ఈమూవీపై భారీ అంచనాలున్నాయి.

- Advertisement -