సీనియర్ నటి గీతాంజలి మృతి

424
geethanjali
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో నగరంలోని ఫిలింనగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె పార్థీవదేహాన్ని నందినగర్‌లోని నివాసానికి తరలించారు. గీతాంజలి మృతి విషయం తెలిసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి సందర్శిస్తున్నారు.

గీతాంజలి అసలు పేరు మణి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లో జన్మించింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె నటుడు రామకృష్ణను వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా చేసిన సీతారామ కల్యాణం సినిమా ద్వారా సినిమాల్లో అడుగుపెట్టారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, దేవత, గూఢచారి 113, శ్రీశ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు.

- Advertisement -