అక్కడ సెల్ఫీ దిగితే…అంతే సంగతులు..!

316
thailand
- Advertisement -

అందమైన బీచ్‌లు, ప్రశాంతమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, చూపరులను ఆకట్టుకునే పర్యాటకం థాయ్‌లాండ్ సొంతం. ప్రశాంతత కోసం చాలామంది ప్రకృతి ప్రేమికులు వెళ్లే ప్రాంతం థాయ్‌నే. అలాంటి థాయ్‌లో ఇప్పుడు ఓ కొత్త నిబంధన పర్యాటకులనే కాదు స్ధానికులను కలవరపెడుతోంది.

థాయ్‌లో అడుగుపెట్టగానే మనల్ని ఆకట్టుకునే ప్రాంతం ఫూకెట్ ఐలాండ్‌లోని మాయ్‌ ఖావో బీచ్‌. దీనికి దగ్గరగా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉండటంతో విమానాలతో సెల్ఫీలు తీసుకునేందుకు జనం పెద్ద ఎత్తున ఎగబడుతున్నారట. రన్‌వేకు దగ్గరగా విమానాలతో సెల్ఫీల కోసం ఎగబడుతుండటంతో కఠిన నిర్ణయాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారట థాయ్ అధికారులు.

ఎయిర్‌పోర్టును సెల్ఫీ నిషేధ ప్రాంతంగా ప్రకటిస్తూ ఎవరైన సెల్ఫీ తీసుకుంటే మరణశిక్ష విధించాలని భావిస్తున్నారట. వీటితో పాటు రూ.70 వేలు జరిమానా విధించేందుకు థాయ్ అధికారులు సిద్ధమవుతున్నట్లు ద సన్ పత్రిక తెలిపింది. పర్యాటకు లకు హాని కలగకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాన్ని అమలుచేయాలని అధికారులు భావిస్తున్నట్లు పేర్కొంది.

అయితే, ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుపుతున్నారు. బీచ్ మీదుగా కింద నుంచి వెళ్లే విమానాలను చూసేందుకే చాలామంది ఇక్కడికి వస్తుంటారని …ఈ నేపథ్యంలో అటు పర్యాటక రంగానికి, ఇటు విమానాలకు విఘాతం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -