ఇకపై ఇంట్లోనే కరోనా టెస్టులు..

101
test
- Advertisement -

కరోనా పాజిటివ్ టెస్టులను ఇకపై ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధానానికి ఐసీఎంఆర్ అమోదం తెలిపింది. దీంతో ఇకపై ఇంట్లోనే కరోనా టెస్టును చేసుకుని రిలీఫ్ పొందవచ్చు.

కోవిసెల్ఫ్ టిఎం కోవిడ్ 19 ఓటీసి యాంటిజెన్ ఎల్ ఎఫ్ అనే కరోనా కిట్ ను పూణే కు చెందిన మైల్యాబ్స్ డిస్కవరీ సోలుషన్స్ అనే సంస్థ తయారు చేసింది.
ఈ టెస్ట్ కిట్ కోసం ఓ మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ సహాయంతో టెస్ట్ కిట్ తో పరీక్షలు చేసుకోవచ్చు.

టెస్ట్ కిట్ లో ఉన్న వస్తువులతో టెస్ట్ చేసుకోవాలి. టెస్టు లను ఫోటో తీసి యాప్ లో నమోదు చేయాలి. టెస్ట్ లను పరిశీలించిన తర్వాత యాప్ కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా నెగిటివ్ వచ్చిందా అన్నది తెలియజేస్తుంది.

- Advertisement -