ఇంగ్లాండ్‌లో ఐపీఎల్‌..!

260
ipl
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా పడిన మ్యాచ్‌ల నిర్వహణపై సందిగ్దం నెలకొనగా టోర్నీ తదుపరి మ్యాచ్‌ల పై ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. టోర్నిలో మిగిలిన మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారట. ఈనెల 29న జరుగనున్న ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్‌జీఎమ్‌)లో బీసీసీఐ ముమ్మరంగా చర్చించనుందని టాక్‌.

బ్రిటన్‌ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే క్రీడా టోర్నీలకు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రేక్షకులను అనుమతిస్తున్నది. దీంతో టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నది’ అని బోర్డు చెందిన ఓ అధికారి చెప్పారు.

మరోవైపు సెప్టెంబర్‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీతో ఈ ఏడాది దేశవాళీ సీజన్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ తర్వాత విజయ్‌ హజారే, రంజీ ట్రోఫీలు నిర్వహించాలనుకుంది. అయితే దేశంలో కరోనా వైరస్‌ రెండో వేవ్‌ ఉద్ధృతంగా ఉండడం, ఐపీఎల్‌ కూడా వాయిదా పడడంతో దేశవాళీ సీజన్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై బోర్డు పునరాలోచించనుంది.

- Advertisement -