సెలీనియం యొక్క ప్రయోజనాలు తెలుసా?

11
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తప్పనిసరిగా పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఖనిజాలు చాలా అవసరం. వీటి ద్వారానే అవయవాల పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇవి ఏ మాత్రం లోపించినా అవయవాల పనితీరు మందగిస్తుంది. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్.. ఇలా చాలానే ఖనిజాల అవసరత ఉంది. వీటితో పాటు సెలీనియం పేరు కూడా వినే ఉంటారు. ఇది కూడా మన శరీరానికి అవసరమైన ఖనిజాలలో ఒకటి. సెలీనియం అనేది సెలెనోప్రోటీన్ అని పిలువబడే వివిధ ఎంజైమ్ ల యొక్క ముఖ్యమైన ప్రోటీన్ దాతువు. .

ఇది మనిషికి ప్రతిరోజూ 55 మైక్రోగ్రాముల అవసరం ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు లేదా పాలిచ్చే తల్లులకు 60-70 మైక్రోగ్రాముల అవసరం ఉంటుంది. సెలీనియం సరైన మోతాదులో శరీరానికి అందడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పెంపించేందుకు యాంటీ ఆక్సిడెంట్లను ప్రేరేపించడానికి సహాయ పడుతుంది. సెలీనియం సరైన మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెగురుపడుతుంది. అంతే కాకుండా థైరాయిడ్ సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలకు సెలీనియం లోపించడం కూడా ఒక కారణం. కాబట్టి ప్రతిరోజు సెలీనియం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గి మానసిక రుగ్మతలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సెలీనియం లభించే పదార్థాలు

తృణధాన్యాలు, బీన్స్ వంటి వాటిలో సెలీనియం అధికంగా లభిస్తుంది. ఇంకా చికెన్, చేపలు, గుడ్లు.. వంటి పదార్థాలలో కూడా సెలీనియం లభిస్తుంది. కాబట్టి సహజసిద్దంగా సెలీనియం లభించేందుకు వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవడం మంచిది.

Also Read: కేసీఆర్..కేసీఆర్..ప్రజల నుండి అనూహ్యస్పందన

- Advertisement -