కరోనా వ్యాక్సిన్ తీసుకోను: బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో

91
brazil

ప్రపంచవ్యాప్తంగా అంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుండగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ ద్వారా అనేక సైడ్ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని అందుకే తాను తీసుకోబోనని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్ళులా మారే అవకాశాలు ఉన్నాయని …. వ్యాక్సిన్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు ఉత్పత్తి సంస్థలు బాధ్యులు కారని పదేపదే చెప్తున్నారని, అదే విషయాన్ని కాంట్రాక్ట్ పత్రంలో క్లియర్ గా తెలిపారని వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్నాక మహిళలకు గడ్డాలు పెరిగినా పెరగొచ్చని, మగవాళ్ళు గొంతు ఆడవాళ్ళ గొంతులా మరీనా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరికి అవసరం లేదని చెప్పుకొచ్చారు బోల్సనారో.