ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి వారణాసి నుంచి పార్లమెంట్ అభ్యర్దిగా పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నేడు వారణాసిలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 11గంటలకు వారణాసి లోకి కలెక్టర్ ఆఫీసులో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈసందర్భంగా వారణాసి లో బీజేపీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్ల పూర్తి చేశారు.
భారీ ర్యాలీతో మోదీ నామినేషన్ వేయనున్నాడని తెలుస్తుంది. నామినేషన్ కార్యక్రమానికి అకాలీదళ్ నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్, ఇతర ఎన్‌డీఏ నేతలు హాజరవుతారు.
2014 సాధారణ ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు వడోదర నుంచి పోటీ చేసి గెలిచారు మోదీ..అయితే వారణిసి నుంచి ఎంపీగా ఉన్న మోదీ వడోదర నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో మోడీ విజయం సాధించారు.