ఆ హీరోయిన్ కు హిట్లు ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదు..

195
meharin

ఆమె చేసిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు.. ఇంతకి ఆ హీరోయిన్ ఎవరూ అనుకుంటున్నారా… ఆమె మెహ్రిన్. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రిన్ ఆసినిమా ఘన విజయం సాధించడంతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈసినిమా తర్వాత మెహ్రిన్ కు మహానుభావుడు సినిమాలో నటించింది.

ఈసినిమా కూడా బాక్సాఫిస్ వద్ద ఘన విజయం సాధించింది. వరుసగా రెండు సినిమాలు విజయం సాధించడంతో కొద్ది రోజులు అవకాశాలు బాగా వచ్చాయి ఈ అమ్మడుకి. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో అవకావాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత రవితేజతో కలిసి రాజా ది గ్రేట్ సినిమాలో నటించింది.

ఈసినిమా ఘన విజయం సాధించడంతో తన తర్వాతి సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2 సినిమా కూడా హిట్ కొట్టడంతో అమ్మడు క్లిక్ అయింది అనుకున్నారు అందరూ..కానీ ఎఫ్ 2 సినిమా తర్వాత ఇప్పటి వరకూ మోహ్రిన్ ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. చాలా మంది హీరోయిన్ లకు హిట్లు లేక అవకాశాలు రావడం లేదు..కానీ మోహ్రిన్ కి మాత్రం హిట్ లు ఉన్నా అవకాశాలు రాకపోవడంతో మెహ్రిన్ వేరే ఇండస్ట్రీ వైపు చూస్తుందని సమాచారం.