పార్లమెంటులో భద్రతా వైఫల్యం

42
- Advertisement -

లోక్‌స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం కలకలం రేపింది. లోక్‌స‌భ‌లో బుధ‌వారం జీరో అవ‌ర్ జ‌రుగుతుండ‌గా విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి ఇద్ద‌రు ఆగంత‌కులు కిందకు దూకి గ్యాస్‌ను వదలడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే భద్రతా వైఫలం బయటపడటం మాత్రం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

స‌భ జ‌రుగుతుండ‌గా అనూహ్యంగా 20 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు వ్య‌క్తులు విజిట‌ర్స్ గ్యాల‌రీ నుంచి స‌భ‌లోకి దూకి ప‌సుపు రంగు గ్యాస్‌ను వ‌దిలార‌ని చెప్పారు కార్తీ చిదంబరం. ఇది ఖచ్చితంగా భద్రత వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. సరిగ్గా 2001లో డిసెంబ‌ర్ 13న పార్ల‌మెంట్‌పై దాడి జ‌ర‌గ్గా సరిగ్గా ఇదే రోజు ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం విశేషం.

Also Read:Nithin:ప్చ్.. నితిన్ పరిస్థితి మళ్లీ మొదటికి!

- Advertisement -