ముదురు భామకు భారీ అవకాశాలు

31
- Advertisement -

ముదురు చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అయ్యి తల్లి అయిపోయింది, ఇక ఈ భామ పని అయిపోయింది అనుకున్నారు చాలా మంది. నిజంగానే గతేడాది ఆమె కెరీర్ చాలా దయనీయ స్థితిలో ఉంది. కానీ, కొత్త సినిమాలేమీ ఆమెకు రాలేదు. కాకపోతే, ఈ ఏడాది ఆమె స్థితి మారిపోయింది. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం రెండు పెద్ద సినిమాలు, ఇద్దరు సీనియర్ హీరోలు. మొదటగా భ‌గ‌వంత్ కేస‌రి. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా నటించి కాజల్ ఫామ్ లోకి వచ్చింది. ఈ సినిమా కంటే ముందు ఒప్పుకున్న మరో సినిమా ఇండియన్ 2.

ఇండియన్ 2 లో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. పైగా ఆమెకు కమల్ హాసన్ తో సోలో సాంగ్స్ ఉన్నాయట. అందుకే, కాజల్ అగర్వాల్ డేట్స్ కోసం ప్రస్తుతం నిర్మాతలు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ సరసన కూడా కాజల్ ఛాన్స్ కొట్టేసింది. అజిత్ వంటి పెద్ద స్టార్ హీరో సినిమాతో పాటు, ఈ భామ ఇప్పుడు విజయ్ హీరోగా హిందీ, తమిళం, తెలుగులో రూపొందనున్న మరో మూవీ కూడా చేస్తోంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ కి మళ్లీ టైమ్ వచ్చినట్టు ఉంది. నిజానికి భ‌గ‌వంత్ కేస‌రి సినిమా వల్ల ఆమెకి ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు.

కానీ, మొత్తానికి భ‌గ‌వంత్ కేస‌రి సినిమా కాజల్ జీవితంలో మళ్లీ వెలుగులు నింపింది. ఇప్పటికే 17 ఏళ్ల కెరీర్ కూడా పూర్తి చేసుకొంది కాజల్. ఆమె వయసు కూడా ప్రస్తుతం 38 దాటింది. అయినప్పటికి కాజల్ ఇలా వరుసగా సినిమాలు చేస్తుండటం నిజంగా విశేషమే. ఐతే, కాజల్ అగర్వాల్ తల్లి అయ్యాక, బాగా బరువు పెరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక, నిత్యం జిమ్ కి కూడా వెళ్తుందట ఈ భామ. కానీ బరువు తగ్గడం లేదు. అయినా, బొద్దులోనూ కాజల్ ముద్దుగానే ఉంది అంటున్నారు నెటిజన్లు. కాబట్టి, బరువు పెద్ద సమస్య ఏమీ కాకపోవచ్చు.

Also Read:పిక్ టాక్ : ఆ అందాలతో సోకుల విందు

- Advertisement -