బ్ర‌హ్మాస్త్ర.. సెకండ్ సింగ‌ల్‌

51
deva deva song
- Advertisement -

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్‌కపుల్ ర‌ణబీర్ క‌పూర్ , ఆలియా భ‌ట్ జంట‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం “బ్రహ్మాస్త్ర” . తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరుతో దీనిని విడుదలచేయనున్నారు. ఈ చిత్రం లో అమితాబ్ బ‌చ్చన్ , హీరో నాగార్జున కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ‘దేవ దేవ’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. గురుజీ ఈ అస్త్రాల ప్ర‌పంచంతో నా జీవితం ఎందుకు ముడిపడి ఉంది’. ‘ఎందుకుంటే, నువ్వు కూడా అస్త్రానివి.. బ్ర‌హ్మ‌స్త్రావి’ అంటూ డైలాగ్‌తో ఈ పాట మొద‌లైంది. సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమా మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుండగా మొద‌టి భాగం ‘శివ’ పేరుతో రానుండగా ఈ చిత్రంలో మౌనీరాయ్ విల‌న్ పాత్ర‌లో న‌టించింది.

- Advertisement -